Surya kumar Yadav : సూర్య సెంచరీపై కోహ్లీ ఆసక్తికర కామెంట్.. స్పందిస్తున్న నెటిజన్లు

0
76
surya kumar yadav

సూర్యకుమార్ యాదవ్ (SuryakumarYadav) బ్యాటింగ్ దూకుడుకు ఏవిధంగా కళ్లెం వేయాలనేది టీ20 క్రికెట్‌లో చర్చనీయాంశమైందంటే అతిశయోక్తిలేదు.

ముంబై: సూర్యకుమార్ యాదవ్ (SuryakumarYadav) బ్యాటింగ్ దూకుడుకు ఏవిధంగా కళ్లెం వేయాలనేది టీ20 క్రికెట్‌లో చర్చనీయాంశమైందంటే అతిశయోక్తిలేదు. మైదానం నలువైపులా ఈ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ కొడుతున్న భారీ షాట్లు ఈ టాపిక్‌కు కారణమవుతున్నాయి. బౌలర్లు బంతిని ఏ దిశగా సంధించినా బౌండరీ తరలించగల ప్రతిభ అతడి సొంతం. న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా (NewZealand Vs India) మధ్య ఆదివారం జరిగిన రెండవ మ్యాచ్‌లోనూ సూర్య ఈ తరహా బ్యాటింగే చేశాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీంతో ప్రత్యర్థి న్యూజిలాండ్‌‌కు భారత్ (NewZealandVsIndia) భారీ స్కోర్ నిర్దేశించింది. దీనిని చేధించలేక ఆతిథ్య దేశం చతికిలపడడం.. భారత్ విజయం సాధించడం తెలిసినవే. కాగా అద్భుత బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ ప్రశంసిస్తూ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ట్విటర్ వేదికగా ఆసక్తికరంగా స్పందించాడు.

‘‘ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్.. ప్రపంచంలో అతనెందుకు ఉత్తమమో చూపిస్తున్నాడు. నాకైతే లైవ్ చూసినట్టు లేదు. అతడాడిన మరో వీడియో గేమ్‌ ఇది’’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ ఉత్సాహంగా స్పందిస్తున్నారు. ట్విటర్‌లో కేవలం 40 నిమిషాల్లోపే 60 వేలకుపైగా లైక్స్ కొట్టారు. సూర్య అదరగొట్టాడంటూ తెగ పొగిడేస్తున్నారు. కాగా ఇటివలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌ 2022లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ద్వయం చెలరేగి ఆడారు. భారత్ సెమీస్ చేరడంలో తమవంతు సహకారం అందించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here