Sreekaram Movie Review in telugu

0
80
Sreekaram Movie Review in telugu
Sreekaram Movie Review in telugu

Sreekaram Movie Review in telugu

Sreekaram Movie Review in telugu
Sreekaram Movie Review in telugu

Star Casting:

Sreekaram Movie Review in telugu

  • శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్, రావు రమేష్, నరేష్,ఆమని, , సాయి కుమార్, మురళీ శర్మ, సత్య, సప్తగిరి తదితరులు

Director: కిషోర్ బీ నటీనటులు: శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్, రావు రమేష్, ఆమని, నరేష్, సాయి కుమార్, మురళీ శర్మ, సత్య, సప్తగిరి ఇంకా తదితరులు

కథ, దర్శకత్వం: కిషోర్ B నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట

Music: మిక్కీ జే మేయర్ డీవోపీ: జే జయరాజ్ ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్ డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా ఆర్ట్: అవినాష్ కోళ్ల బ్యానర్: 14 Reels Banner

Released Date: 11.03.2021

శ్రీకారం సినిమా కథ

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా భారీ వేతనం అందుకొనే కార్తీక్ (శర్వానంద్) ఉద్యోగానికి రాజీనామా చేస్తూ అనూహ్యమైన నిర్ణయం తీసుకొంటాడు. సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి రైతుగా మారాలనుకొంటాడు. తిరుపతి ప్రాంతానికి చెందిన నిరుపేద రైతు కుటుంబానికి చెందినవాడు కార్తీక్ (శర్వానంద్). తనతో తన కంపెనీలోనే పనిచేస్తున్న చైత్రతో (హీరోయిన్) ప్రేమలో పడుతాడు.

అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన కార్తీక్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదలేసి వ్యవసాయం చేయాలని అనుకోవడానికి కారణం ఏమిటి?

ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత హీరోకి ఎదురైనా పరిస్టితులు ఏమిటి? కార్తీక్ తీసుకొన్న నిర్ణయానికి హీరో తల్లిదండ్రులు అతని గర్ల్ ఫ్రెండ్ (చైత్ర) స్పందన ఏమిటి?

జాబ్ వదలిసిన కార్తీక్‌కు వ్యవసాయం చేసే సమయంలో ఎదురైన కష్టాలు ఏమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? కార్తీక్ తన లక్ష్యాన్ని చివరకు చేరుకొన్నాడా? లేదా అనే ప్రశ్నలకు సమాధానం కోసం శ్రీకారం మూవీ చూడాల్సిందే .

సినిమా లో కార్తిక్ , చైత్ర లవ్ ట్రాక్‌ నడుస్తూనే , తన గ్రామానికి చెందిన రైతు మరియు అతని బంధువు (నరేష్) రైతు నుండి రైతుకూలీగా మారిన సన్నివేశంతో కథలో ఎమోషనల్ పాయింట్ మొదలవుతుంది. వ్యవసాయం చేసే పద్దతులు, రైతులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మరింత బాగా కనిపిస్తాయి.

తాతల కాలం లో గొప్పగా ఉన్న వ్యవసాయం తండ్రుల కాలానికి వచ్చే సరికి ఎందుకు తగ్గిపోయిందనే విషయాన్ని గుండెకి హత్తుకొనేలా చేస్తుంది. చివర్లో కరోనా పరిస్థితుల అంశాన్ని తెచ్చి వ్యవసాయం యొక్క ఆవశ్యకతను కళ్లకు కట్టినట్టుగా చూపించడంలో దర్శకుడు సఫలమయ్యాడు.

డైరెక్టర్ కిషోర్ ప్రతిభ ఏమిటో ఈ సినిమాలో ఓ మంచి పాయింట్‌తో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. ఈ సినిమా క్లైమాక్స్‌ను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. నరేష్, రావు రమేష్, ఆమని, సాయి కుమార్ పాత్రలు సినిమాకు ప్లస్ అయ్యాయి. కాకపోతే మహర్షి, భీష్మ లాంటి సినిమాల గతంలో వచినప్పటికి ఈ సినిమా మలిచిన విధానం ప్రేక్షకుల్ని ధియేటర్లకు వచ్చేలా చేస్తుంది.

శర్వానంద్ యాక్టింగ్ ఐటీ కంపెనీ ఉద్యోగిగా, యువ రైతుగా రెండు విభిన్నమైన కోణాలు ఉన్న కార్తీక్ పాత్రలో శర్వానంద్ మరోసారి ఒదిగిపోయాడు. పలు సన్నివేశాల్లో శర్వానంద్ పలికించిన హావభావాలు మనసును తాకుతాయి. కథకు బలంగా మారిన సన్నివేశాల్లో శర్వానంద్ నటన హైలెట్‌గా చెప్పుకోవచ్చు. పలు అంశాల మధ్య నలిగిపోయే యువకుడిగా తెర మీద బాగా రాణించాడని ఫీలింగ్ కలుగుతుంది.

sreekaram-sharwanand-శ్రీకారం మూవీ రివ్యూ అండ్ రేటింగ్, Sreekaram movie review in telugu, telugu movie reviews, movie reviews in telugu, latest telugu movies

Credits:

https://telugu.filmibeat.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here