How to recover deleted Whatsapp images 2021
Whatsappలో Delete అయిన photoలను రికవర్ చేసుకోవాలంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి.

Whatsappలో తమ స్నేహితులు పంపించిన ఫోటోలు కొన్ని సందర్భాలలో పొరబాటున Delete చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాటిని తిరిగి పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలో Delete చేయబడిన Whatsapp photo లను రికవరీ చెయ్యడానికి రెండు పద్ధతుల గురించి ఇప్పుడు చూద్దాం.
How to recover deleted Whatsapp images in mobile
1) Whatsapp Backup ఉపయోగించి!
ఎక్కువ సందర్భాలలో ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది. Google Driveలోకి గానీ, లేదా మీ phoneలోని Internal స్టోరేజ్‌లో గానీ, రోజుకి ఒకసారి మీ Whatsapp Backup తీయబడుతుంది.
ఈ నేపథ్యంలో డిలీట్ అయిన ఫోటోలను Recovery చెయ్యటానికి ఆ బ్యాకప్ ఉపయోగించవచ్చు. అయితే ఈ రోజు ఉదయం 6 గంటలకు మీ ఫోన్లో వాట్సప్ Backup చేయబడితే మళ్లీ రేపు ఉదయం 6 గంటలకు మరోసారి అది బ్యాకప్ తీయబడుతుంది. ఈరోజు బ్యాకప్ స్థానంలో రేపటి బ్యాకప్ ఓవర్ write అవుతుంది.
మీరు ఈ రోజు ఉదయం 10 గంటలకు మీ స్నేహితుల నుండి ఎప్పుడో వచ్చిన ముఖ్యమైన ఫోటోలను మీరు Delete చేశారు అనుకోండి. రేపు ఉదయం 6 గంటల లోపు ఈ పద్ధతి ద్వారా మీరు అలా డిలీట్ చేసిన ఫోటోలను Whatsapp Database నుంచి పొందొచ్చు.
దీనికి మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్ లో వాట్సాప్ తొలగించి, మళ్లీ Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకొని install చేసుకోండి.
2) Recovery Appsను వాడి…
Dr.Phone Recovery లాంటి అనేక Data Recovery అప్లికేషన్స్ లభిస్తుంటాయి. వీటిని మీ Computer లో గాని Laptop లో గాని ఇన్స్టాల్ చేసుకుని, ఆ Computer కి మీ ఫోన్ కనెక్ట్ చేసి డేటా రికవరీ చేయవచ్చు. అయితే ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి.
ఇవి ఉచితంగా లభించే Applications కాదు. Paid Applications. రెండోది ఈ యాప్స్ పని చేయాలంటే ఖచ్చితంగా మీ ఫోన్ root చెయ్యబడి ఉండాలి.
అప్పుడు మాత్రమే Data Recovery అవుతుంది. ఈ రెండు కండిషన్స్ సరిపోతే ఖచ్చితంగా మీ Delete అయిన ఫోటోలు తిరిగి వెనక్కి పొందొచ్చు.
How to recover deleted Whatsapp images in android
How to recover deleted Whatsapp images in india