Fireman Jobs Recruitment 2021 In Telugu : జీతం 67,390 పైర్‌మెన్ ఉద్యోగాలు, ఇప్పుడే అప్లై చేసుకోండి
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). భారీస్థాయిలో జీతములు.
ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ SPMCIL కు చెందిన ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు భారత దేశ వ్యాప్తంగా ఉన్న SPMCIL యూనిట్ లలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
తాజాగా వచ్చిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్,హైదరాబాద్ నుండి వచ్చిన ఈ ఉద్యోగాల భర్తీకీ సంబంధించిన విధి – విధానాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : డిసెంబర్ 15 , 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జనవరి 15, 2022
దరఖాస్తు ఫీజు లను చెల్లించడానికి చివరి తేది : జనవరి 15, 2022.
ఆన్లైన్ పరీక్షల నిర్వహణ తేదీలు : ఫిబ్రవరి /మార్చి, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ టెక్నీషియన్ ( ప్రింటింగ్ ) – 25
ఫైర్ మెన్ (RM) – 02
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 27 పోస్టులను తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
సంబంధిత సబ్జెక్టు విభాగాలలో గుర్తింపు పొందిన బోర్డులనుండి ఐటీఐ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్ ) కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు 10వ తరగతి లో ఉత్తిర్ణత ను చెంది, గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్ నుండి ఫైర్ మెన్ సర్టిఫికెట్ మరియు నిర్థిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఫైర్ మాన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ/EWS కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ/ దివ్యంగుల కేటగిరీ అభ్యర్థులు 200 రూపాయలు ను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
ఆన్లైన్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆబ్జెక్టివ్ టైపు లో ఈ ఆన్లైన్ టెస్ట్ ను నిర్వహించనున్నారు. నెగిటివ్ మార్కింగ్ అమలులో లేదు.
ఆన్లైన్ టెస్ట్ – సిలబస్ :
సబ్జెక్ట్
ప్రశ్నలు
మార్కులు
రీజనింగ్
40 ప్రశ్నలు
40 మార్కులు
జనరల్ అవేర్నెస్
40 ప్రశ్నలు
40 మార్కులు
ఇంగ్లీష్ లాంగ్వేజ్
40 ప్రశ్నలు
40 మార్కులు
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్
40 ప్రశ్నలు
40 మార్కులు
మొత్తం 160 మార్కులకు, 160 ప్రశ్నలను అడగనున్నారు. పరీక్ష కాలవ్యవధి 90 నిముషాలు ఉండనుంది.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18,780 రూపాయలు నుండి 67,390 రూపాయలు వరకూ జీతం అందనుంది.